Header Banner

చిరంజీవి - అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా లేడి సూపర్ స్టార్.? ఎవరో తెలుసా?

  Sat May 17, 2025 13:02        Entertainment

మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ (మెగా 157) తెర‌కెక్కనున్న‌ విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్ పూజాకార్య‌క్ర‌మాలు కూడా జరుపుకుంది. త్వ‌ర‌లోనే చిత్ర‌ షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతోన్నారు మేక‌ర్స్‌. ఈ లోపు చిరు కోసం అనిల్ క‌థానాయిక‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడిగా నయనతార‌ నటిస్తోందని పుకార్లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ మేక‌ర్స్ ఆమెనే హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఈ మేర‌కు తాజాగా ఓ వీడియోను కూడా విడుద‌ల చేశారు. 'మెగా 157' ప్రాజెక్ట్‌లోకి నయన్ వచ్చిందంటూ వదిలిన వీడియో ఆక‌ట్టుకుంటోంది. మ‌రోసారి అనిల్ రావిపూడి త‌న‌దైన‌శైలిలో ఈ వీడియోను రూపొందించారు. ఒక విధంగా చెప్పాలంటే... అసలు ప్రమోషన్స్ అంటే నో చెప్పే నయన్‌తోనే సినిమా ఆరంభానికి ముందే ఆమెను అనిల్ ప్రమోషన్స్‌లోకి తీసుకొచ్చార‌నే చెప్పాలి. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

 

వీడియో చివ‌ర్లో  సంక్రాంతికి రఫ్పాడించేద్దాం అని ఇద్దరూ (న‌య‌న్‌, అనిల్) చిరు ఐకానిక్ పోజులు పెట్టడం ఆక‌ట్టుకుంటోంది. అలాగే చిరంజీవి మేన‌రిజంలో హలో మాస్టారు... కెమెరా కొద్దిగా రైట్ ట‌ర్నింగ్ ఇచ్చుకోమ్మా అంటూ చెప్పిన సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులోకి ఆమెను ఆహ్వానిస్తూ చిరంజీవి కూడా పోస్టు పెట్టారు. "హ్యాట్రిక్ మూవీకి స్వాగ‌తం. ఆమెతో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది" అని చిరు అన్నారు. కాగా, చిరు, న‌య‌న్ కాంబినేష‌న్‌లో ఇదివ‌రకే ఈ 'సైరా న‌ర‌సింహారెడ్డి', 'గాడ్ ఫాద‌ర్' చిత్రాలు వచ్చిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఈ మూవీ షూటింగ్‌ను ఈ ఏడాదిలోనే పూర్తి చేసి, 2026 సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. భీమ్స్ సంగీతం ఈ చిత్రానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. మ‌రోవైపు ఇప్ప‌టికే విశ్వంభ‌ర‌ను పూర్తి చేసిన చిరంజీవి... అనిల్ మూవీ త‌ర్వాత ద‌స‌రా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలాతో మ‌రో సినిమా చేయ‌నున్నారు. 

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ పడగ నేడు.. విలువల నడక! నాడు - నేడుతో నేను తెచ్చిన మార్పు ఇదే!

 

ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ ఇంట్లో ఎలాంటి ఆస్తి తగాదాలు ఉండవు - సరైన అథెంటికేషన్‌ లేకపోతే!

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chiranjeevi #PMModi #WAVES